వాడుకోవ‌డం వ‌దిలేయ‌డం చంద్ర‌బాబు నైజం

tdp-27-.jpg

వెనుకబడిన వర్గాలకు టీడీపీ మరో వెన్నుపోటు పొడిచింది. ముగ్గురు బీసీ రాజ్యసభ సభ్యులు చేత చంద్రబాబు రాజీనామా చేయించారు. రాజ్యసభ అభ్యర్థులకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా, డిసెంబర్ 20న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్య రాజీనామా చేయించగా మోపిదేవి, ఆర్. కృష్ణయ్యలకు ఆ స్థానాలు ఇవ్వకూడదని టీడీపీ నిర్ణయించింది. డీల్ కుదుర్చుకున్న బీద మస్తాన్రావుకి మాత్రమే టీడీపీ రెన్యూవల్ చేయనుంది. మోపిదేవి, ఆర్ కృష్ణయ్య స్థానాలు బాగా డబ్బున్న వారికే ఇవ్వాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. టీడీపీ రాజ్యసభ రేస్లో సానా సతీష్, గల్లా జయదేవ్, కిలారు రాజేష్, కంభంపాటి రామ్మోహన్, లింగమనేని రమేష్లు పోటీ పడుతుండగా, మూడు స్థానాల్లో ఒక రాజ్యసభ కోసం బీజేపీ పట్టుబడుతోంది.

Share this post