టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదును ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. మద్యం, ఇసుక వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. మద్యం కూడా ఎమ్మార్పీ ధరలకే అమ్మాలని సూచించారు. ఎవరైనా ఇసుక దండా చేస్తే తిరుగుబాటు చేయాలని కార్యకర్తలకు సూచించారు.
టీడీపీ నాయకులకు చంద్రబాబు మరోసారి వార్నింగ్..
