ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి వాసంశెట్టి సుభాష్ పై సీరియస్ అయ్యారు. నువ్వు రాజకీయాలకు పనికిరావు అంటూ కాన్ఫరెన్స్ కాల్ లోనే మంత్రిని చంద్రబాబు తిట్టారు. మంత్రి వాసంశెట్టి సొంత నియోజకవర్గమైన రామచంద్రపురంలో పార్టీ సభ్యత్వం చాలా తక్కువగా ఉందని బాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన మంత్రి మీద సీరియస్ అయినట్లు తెలుస్తుంది. మొదటిసారి గెలిచినప్పటికీ కూడా మంత్రి పదవి ఇచ్చాం, పార్టీ నీకు చాలా గౌరవం కూడా ఇచ్చింది. దానిని నువ్వు కాపాడుకోవాలంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. మంత్రి అయినప్పటికీ కూడా రాజకీయాల్లో సీరియస్ నెస్ రాలేదంటూ అక్షింతలు వేశారు. పార్టీకి ఉపయోగపడని, పార్టీ కోసం పనికిరాని రాజకీయాలు ఎందుకంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఇక నైనా రాజకీయాల్లో సీరియస్ గా ఉండి, ప్రూవ్ చేసుకోవాలని చంద్రబాబు వాసంశెట్టికి గట్టిగా క్లాస్ పీకారు.
మంత్రికి చంద్రబాబు వార్నింగ్..
