టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లో చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని 34 మంది వైసీపీ శ్రేణులపై కొందరు ముసుగు ధరించి భౌతిక దాడులకు దిగారని మాజీ ఎమ్మెల్యే చెవిరెడి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లకు మీరంటే మీరు బాధ్యులు అంటూ మాటల తూటాలు పేలుస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి టీడీపీ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ స్టార్ట్ అయింది. చెవిరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రగిరిలో ఒక్కరినీ కూడా ఇబ్బంది పెట్టలేదంటున్నారు. చంద్రగిరికి చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్ వస్తే కూడా గౌరవించానంటున్న చెవిరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు హుందాగా వ్యవహరించా నంటున్నారు. గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తన సహకారంలో పులివర్తి నాని తన సొంత పనులు చక్కబెట్టుకున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కౌంటర్ ఇచ్చారు. సాంకేతికంగా దొరికిపోతారనే భయంతోనే ఆరోపణలు చేస్తున్నారని పులివర్తి నాని అన్నారు.
ముసుగు ధరించి భౌతిక దాడులు..
