విజయవాడ మేరీ మాత ఉత్సవాలలో రెచ్చిపోయిన యువకులు..

vijayawada-10.jpg

విజయవాడ మేరీ మాత ఉత్సవాలలో కొందరు యువకులు రెచ్చిపోయారు. ఉత్సవాలు జరుగుతున్న క్రమంలో తీవ్ర రద్దీని చూసుకుని పవన్ అనే వ్యక్తిపై మధురానగర్ ప్రాంతానికి చెందిన మరో బ్యాచ్ బ్లేడుతో దాడికి పాల్పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పవన్ అనే వ్యక్తికి స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన బ్యాచ్‌లో ఒక వ్యక్తిని అవుట్ పోస్ట్ పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరి మధ్య పాత గొడవలే హత్యయత్యానికి కారణమని పోలీసులు నిర్దారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు మిగతా యువకుల కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది.

Share this post

scroll to top