హరిరామ జోగయ్య డిప్యూటీ సీఎంకు బహిరంగలేఖ..

jogaya-15.jpg

వివిధ అంశాలపై ఇప్పటికే ఎన్నో సార్లు బహిరంగ లేఖలు రాస్తూ వచ్చిన మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు బహిరంగ లేఖ అంటూ ఓ లేఖ రాశారు. కృష్ణ, గుంటూరు జిల్లాల్లో రాజధాని పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే సుమారు 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మరో 50 వేల కోట్లు ఖర్చు చేయడనికి కూడా సిద్ధం అవుతున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం ఆఫీసులు, శాసనసభ, శాసనమండలి, హైకోర్టు వంటి వాటికోసం ఖర్చు చేయడం మంచిదే కానీ, మిగతా వాటి సంగతి ఏంటి? అని ప్రశ్నించారు.

ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ వారాహి సభలో ఉభయ గోదావరి జిల్లాలను దత్తత తీసుకుంటూనన్నారు. మరి గోదావరి జిల్లాల అభివృద్ధికి ఏ విధమైన సౌకర్యాలు కల్పించారో చెప్పాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు హరిరామ జోగయ్య. విద్య, వైద్యం, రోడ్లు, రవాణా, వ్యాపార, వ్యవసాయ, సాగునీరు, తాగునీరు, పరిశ్రమలు, ఓడరేవులు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఏళ్ల తరబడి సమగ్ర అభివృద్ధికి నోచుకోని గోదావరి జిల్లాలకు కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో ఏ అభివృద్ధి పథకాలకు ఎంత ఖర్చు చేశారో వైట్ పేపర్ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంతేకాదు ప్రతీ ఏడాది ఒకసారి ప్రతి జిల్లాకు చేసిన ఖర్చుపై వైట్ పేపర్ రిలీజ్ చేస్తే ప్రజలు సంతోషిస్తారని తన లేఖ ద్వారా సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లారు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య.

Share this post

scroll to top