నందమూరి బాలకృష్ణ నటుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర పరిశ్రమ, అభిమానులు కలిసి బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్ నోవాలెట్ ఆడిటోరియమ్ వేదికగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
నందమూరి కుటుంబ సభ్యులతో పాటు టి. సుబ్బరామిరెడ్డి, రఘు రామ కృష్ణం రాజు, కె, రాఘవేంద్రరావు, మురళీమోహన్, విజయేంద్ర ప్రసాద్, అశ్వినీదత్, సుహాసిని, మంచు విష్ణు, మాలశ్రీ, మైత్రీ మూవీమేకర్స్ నిర్మాతలు, నవీన్, రవిశంకర్, గోపీచంద్, బోయపాటి శ్రీను, పి.వాసు, జయసుధ కుటుంబం, విశ్వక్ సేన్, తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి, వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్స్ విచ్చేసి సందడి చేశారు.