ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి గాయాలైన ఘటనపై పవన్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ప్రస్తుతం మార్క్ బాగానే ఉన్నాడని, అతడి కాళ్లకు స్వల్ప గాయాలు అయ్యాయని తెలిపారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అతని చేతులు, కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఓ దవాఖానలో అతను చికిత్స పొందుతున్నాడు. విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
పవన్ కుమారుడికి గాయాలపై స్పందించిన చిరంజీవి..
