త్వరలో చిరు నవ్వుల పండగబొమ్మకి శ్రీకారం..

chiru-26.jpg

మెగాస్టార్ చిరంజీవి మరియు బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో రాబోతున్న చిత్రం గురించి తాజా అప్‌డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం కోసం ఫైనల్ స్క్రిప్ట్ నరేషన్ పూర్తయి, లాక్ చేయబడినట్లు అనిల్ రావిపూడి స్వయంగా ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఈ ట్వీట్‌లో చిరంజీవి పాత్రను శంకర్ వరప్రసాద్ గా పరిచయం చేసినట్లు తెలిపారు. ఈ కథను విన్న చిరంజీవి దాన్ని పూర్తిగా ఆస్వాదించారని, ఎంజాయ్ చేశారని అనిల్ పేర్కొన్నారు. త్వరలో ముహూర్తంతో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందని, ఇది ‘చిరు’ నవ్వుల పండగబొమ్మగా ప్రేక్షకుల ముందుకు రానుందని ఆయన సంతోషంగా వెల్లడించారు.

అనిల్ రావిపూడి తన ట్వీట్‌లో చిరంజీవి కోసం రూపొందించిన “శంకర్ వరప్రసాద్” పాత్ర గురించి ప్రస్తావించడం ఆసక్తికరం. ఈ పాత్ర పేరు ఆయన నిజ జీవిత పేరు కావడం, అనిల్ మార్క్ కామెడీ మరియు ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ పాత్ర చిరంజీవి అభిమానులకు కొత్త అనుభవాన్ని అందించనుందని తెలుస్తోంది. చిరంజీవి గతంలో శంకర్ దాదా MBBS, ‘శంకర్ దాదా జిందాబాద్ వంటి చిత్రాల్లో కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో “శంకర్ వరప్రసాద్ గా మరోసారి నవ్వుల విందును పంచేందుకు సిద్ధమవుతున్నారు. అనిల్ రావిపూడి తన ట్వీట్‌లో చిరంజీవి స్క్రిప్ట్‌ను ఎంతగానో ఇష్టపడ్డారని, దాన్ని ఆనందించారని పేర్కొన్నారు. ఇది చిత్ర బృందానికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చే అంశం. అనిల్ రావిపూడి గత చిత్రాలైన F2, సరిలేరు నీకెవ్వరు, F3, సంక్రాంతికి వస్తున్నాం వంటివి కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు చిరంజీవి లాంటి లెజెండరీ హీరోతో ఆయన చేయబోయే ఈ ప్రాజెక్ట్ ఎంతటి వినోదాన్ని అందిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Share this post

scroll to top