సినీనటుడు ప్రకాశ్ రాజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లక్ష్యంగా చేసుకుని వరస ట్వీట్లు చేస్తున్నారు. పవన్, ప్రకాశ్ రాజ్‌ల మధ్య మాటల యుద్ధం మూడు రోజుల నుంచి నడుస్తుంది. తిరుమల లడ్డూపై పవన్ చేసిన వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ కూడా ప్రకాశ్ రాజ్ కు ఘాటు కౌంటర్ ఇవ్వడంతో ఇద్దరి మధ్య వివాదం రచ్చ కెక్కుతోంది. మనకేం కావాలి ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమైన..అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్ చేశారు.
జస్ట్ ఆస్కింగ్ మనకేం కావాలి..
