ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజా రాజధాని అమరావతి ని ఎడారిగా మార్చేశారని సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఇవాళ అమరావతి లోని తాళ్లాయపాలెం లో జీఐఎస్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి లో విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పుడు మొదలు పెట్టిన సబ్ స్టేషన్లు అన్ని ఏడాదిలోపు పూర్తి చేస్తామని పేర్కొ్న్నారు. గతంలో కరెంట్ కోతల మీద పెద్ద చర్చే జరిగేదని తాను విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు చాలామంది వ్యతిరేకించారని తెలిపారు. కొరత లేకుండా చేయడమే కాకుండా మిగులు కరెంట్‌ను కూడా తీసుకొచ్చామని అన్నారు.
అమరావతిని ఎడారిగా మార్చేశారు..
