ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత సమావేశమయ్యారు. హోంమంత్రిపై పవన్ వ్యాఖ్యలు, ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పోలీసుల రియాక్షన్‌పై పవన్ ఇటీవల అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాను హోంమంత్రి అయితే రాష్ట్రంలో పరిస్థితులు వేరేగా ఉంటాయని ఇటీవల పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తానే హోం మంత్రి పదవి తీసుకోవలసి వస్తుందంటూ పవన చేసిన వ్యాఖ్యలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనితల భేటీపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా బుధవారం కేబినెట్ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు మంత్రుల తీరుపై మండిపడిన సంగతి తెలిసిందే. ఇంకా కొందరు మంత్రులలో సీరియస్‌నెస్ రావడం లేదని వ్యాఖ్యానించారు.
సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హోంమంత్రి అనిత కీలక భేటీ..
