ఇంటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన చంద్రబాబు..

cbn-09.jpg

అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తను కూడా రాజధాని ప్రాంతంలో ఇల్లు నిర్మాణాన్ని తలపెట్టారు. దీని కోసం గత ఏడాది వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నివాస ప్లాట్‌ను రైతు కుటుంబం నుంచి కొనుగోలు చేసిన విషయం విదితమే కాగా ఈ రోజు ఇంటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఇంటి నిర్మాణ ప్రాంతానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ కుటుంబ సభ్యులు చేరుకుని వేద పండితుల ఆధ్వర్యంలో శంకుస్థాపన పూజా కార్యక్రమం నిర్వహించారు. భూమి పూజ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి లోకేష్ సతీమణి బ్రాహ్మణి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సచివాలయం వెనుక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం జరగనుంది. రాజధాని కోర్ ఏరియాలో వెలగపూడి పరిధిలో సీఎం చంద్రబాబు నివాసం ఉండనుంది.

Share this post

scroll to top