మంత్రులు, అధికారులతో రాష్ట్రంలో వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులకు డివిజన్ల వారీగా బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే ఒక్కో ఐఏఎస్ అధికారికి ఒక్కో డివిజన్ కేటాయింపు చేశారు. రామలింగేశ్వర నగర్ ప్రాంతంలోకి వరద చేరుతుండడంపై అక్కడ పరిస్థితినీ సీఎం సమీక్షిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్దకు కొట్టుకొచ్చిన బోట్లని ఏ విధంగా తప్పించాలో చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అన్నింటికంటే బాధితుల తరలింపునకు ప్రాణాలను కాపాడేందుకే హై ప్రయార్టీ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆహార సరఫరాకు ఆటంకాలే ఉండకూడదని ఇక, బాధితుల తరలింపునకే కాకుండా అవసరమైన మేరకు ఆహార సరఫరాకూ ఛాపర్లను వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు..
