ప్రజావేదిక నిర్వహించి ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టే వారిని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై ఇష్టానుసారం పోస్టులు పెడితే వారికి అదే చివరి రోజు అని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా నేరస్థులకు అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవడైనా సరే వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అదే చివరి రోజు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మహిళలను గౌరవప్రదంగా బతకనివ్వండి. మీకు చేతనైతే విలువలు నేర్పించండని సీఎం చంద్రబాబు హితవు పలికారు.
ఎవడైనా సరే వ్యక్తిత్వ హననానికి పాల్పడితే వారికి అదే చివరి రోజు..
