రూరల్ వాటర్ సప్లై, జల్ జీవన్ మిషన్ పై ఈ రోజు సమీక్ష నిర్వహించనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇంటింటికీ కుళాయి నీరు అందించే అంశంపై చర్చించనున్నారు. కేంద్ర నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని ఇంటింటికీ తాగు నీరు అందించేలా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే, జల్ జీవన్ మిషన్ పథకాన్ని పూర్తిగా గత ప్రభుత్వం పక్కని పెట్టిందనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమ హయాంలో ఇంటింటికీ కుళాయి నీరు అందించడమే టార్గెట్‌గా పెట్టుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది.
జల్ జీవన్ మిషన్ పై నేడు సీఎం సమీక్ష..
