రాజధాని అమరావతిలోని కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు సందర్శించి పూజలు చేశారు. గర్భాలయంలో నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వేంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ అనంతశేష స్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆలయ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. అక్షయ పాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధుపండిత్, మంత్రులు నారాయణ, సవిత, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. పేదరిక నిర్మూలన నినాదమే తన లక్ష్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.
నాకు ప్రాణబిక్ష పెట్టింది వేంకటేశ్వర స్వామి’.. ఇస్కాన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు..
