ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా.. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ లు అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించి, దర్శనం చేసుకున్నారు. సీఎం ఆలయానికి వచ్చినా.. సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దర్శన ఏర్పాట్లు చేశారు.
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు..
