రక్షణ భూముల బదలాయింపుపై రాజ్ నాథ్ సింగ్‌కు రేవంత్ రెడ్డి విజ్ఞాపనలు ఇవ్వనున్నారు. హైదరాబాద్ నగరంలో రహదారులు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూములు కేటాయించాలని రాజ్‌నాథ్ సింగ్‌ను సీఎం కోరనున్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు మెహిదీపట్నం రైతు బజార్ వద్ద స్కైవాక్ నిర్మిస్తున్నామని, ఇందుకోసం అక్కడ ఉన్న రక్షణ శాఖ భూమి 0.21 హెక్టార్లను బదిలీ చేయాలని కేంద్రమంత్రిని సీఎం కోరనున్నారు. రాష్ట్రంలో స్కై వేల నిర్మాణం, రక్షణ శాఖ భూముల బదలాయింపులపై రాజ్ నాథ్ సింగ్‌తో ముఖ్యమంత్రి రేవంత్ చర్చించనున్నారు.
రక్షణ శాఖ భూమలు కేటాయించాలి
