సీఎం రేవంత్ రెడ్డి నేడు జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. జాతీయ రహదారుల పనులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు చేపట్టే విషయంపై ఈ సమీక్షలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో.. NHAI అధికారులు, కలెక్టర్లు, అటవీశాఖ అధికారులు హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే.. జాతీయ రహదారుల నిర్మా ణానికి తమ పూర్తి సహకారం ఉంటుం మని స్పష్టం చేశారు. ఎన్ హెచ్ ఏఐ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఆయన నివాసంలో మంగళవారం సమావే శమయ్యారు. రాష్ట్రంలో ఎన్ హెచ్ ఏఐ చేపడు తున్న రహదారుల నిర్మాణంలో భూసేకరణతో పాటు తలెత్తున్న పలు ఇబ్బందులను అధికారు లు ముఖ్యమంత్రి కి వివరించారు. స్పందించిన ముఖ్యమంత్రి ఆయా సమస్యల పరిష్కారానికి బుధవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. రహదా రులు నిర్మాణం జరిగే జిల్లాల కలెక్టర్లు, అటవీశాఖ అధికారులు భేటీలో పాల్గొంటారని, ఆయా సమస్యలపై చర్చించి అక్కడే సమస్య లను పరిష్కరించుకుందామని ఎన్హెచ్ఎఐ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
నేడు సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష
