హైడ్రా బాధితులకు అండగా సీఎం రేవంత్‌రెడ్డి ..

ravanth-25.jpg

హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మణాలపై హైడ్రా ఏ స్థాయిలో కొరడా ఝులిపిస్తోందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా రోజు రోజుకి మరీంత దూకుడుగా వ్యవహారిస్తుంది. ఇక ఈ విషయంలో సామాన్యులు, ధనవంతులు, సెలబ్రిటీస్ లేకుండా రూల్స్ కి భిన్నంగా ఉన్న నిర్మాణా భవనాలను గుర్తించి హైడ్రా నిర్ధాక్ష్యణంగా కూల్చేస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు హైడ్రా మునపటి కంటే ఇప్పుడు అక్రమ నిర్మాణాల కూల్చివేతపై కాస్త జోరు పెంచిందనే చెప్పవచ్చు.

నగరంలో చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపు విషయంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలు సేకరించాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూం లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇకపోతే ఔటర్ లోపల ఉన్న చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఆక్రమణలకు గురి కాకుండా పర్యవేక్షించేందుకు చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. 

Share this post

scroll to top