సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజిబిజిగా గడుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపదాస్ మున్షీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ ,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రియాంకతో సమావేశం అయ్యారు. ఢిల్లీలోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీకి సంబంధించి వరంగల్‌లో భారీ సభకు కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో వరంగల్ సభకు ఏఐసీసీ అగ్రనేతలను ఆహ్వానించాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. అయితే ఇవాళ్టీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన నేపథ్యంలో ఏఐసీసీ అగ్రనేతలు పార్లమెంట్‌లో ఉన్నారు. దీంతో నేతలను కలవడానికి సీఎం పార్లమెంట్ వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో సీఎం పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
వీ