జాతీయ ఆరోగ్య మిషన్ కింద తెలంగాణకు రావాల్సిన బకాయిలు రూ.693.13 కోట్లు వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని మంగళవారం ఆయన కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైద్యారోగ్య రంగంపై తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న ప్రత్యేక శ్రద్ధను కేంద్ర మంత్రికి వివరించారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనలన్నింటిని తాము ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నడ్డాకు తెలియజేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకుగానూ 5,159 బస్తీ దవాఖానాలు సమర్థంగా నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
జేపీ నడ్డాతో CM రేవంత్ భేటీ NHM నిధులపై కేంద్రమంత్రికి కీలక విజ్ఞప్తి..
