కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

ravanth-reddy-30.jpg

గాంధీ భవన్ లో నిర్వహించిన కుల గణన మీటింగ్ లో తెలంగాణ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గాంధీ కుటుంబం ఒక మాట ఇస్తే హరిహరాదులు అడ్డు వచ్చినా అది నెరవేర్చి తీరుతుందన్నారు. మనం మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టే వారసులం అని చెప్పుకొచ్చారు. రేవంత్ కి ప్రత్యేక గుర్తింపు ఏమీ లేదు.. కాంగ్రెస్ పార్టీనే గుర్తింపు ఇచ్చిందని ఆయన తెలిపారు. మీరంతా కష్టపడితేనే నాకు ఈ బాధ్యత వచ్చింది. పార్టీ ఎజెండాతోనే ప్రజల్లోకి వెళ్లాం. పార్టీ విధానాన్ని అమలు చేయడమే మన ప్రభుత్వ విధానం పని చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నా ప్రతీ క్షణం సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ క్యాడర్, లీడర్స్ మీద ఉందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Share this post

scroll to top