రేపు తిరుమలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

ravanth-reddy-09.jpg

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు తిరుమల తిరుపతి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు సీఎం రేవంత్ తిరుపతి వెళ్లనున్నారు. దీంతో ముందుగానే తిరుమల అధికారులకు సమాచారం అందించడంతో టీటీడీ అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వెంటనే సీఎం తిరుమల శ్రీవారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం రాత్రి తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తిరుమల దర్శనానికి వస్తుండటంతో అక్కడి అధికారులు సైతం పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

Share this post

scroll to top