మూసీ పునరుజ్జీవనం చుట్టూ జరుగుతున్న రాజకీయ రగడ అంతా ఇంతా కాదు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టు గురించి ప్రకటించిన దగ్గరి నుంచి ప్రతిపక్షాలు ఏదో ఒక రూపంలో రాజకీయం చేస్తూనే ఉన్నాయి. అయితే, విపక్ష నేతల ఆరోపణలు, విమర్శలను తిప్పికొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. మైకుల ముందు కూర్చుని ప్రజలను రెచ్చగొట్టే నాయకులకు, ప్రజల వద్ద నుంచి సమాధానం చెప్పేందుకు డిసైడ్ అయ్యారు. అందుకోసం మూసీ పునరుజ్జీవ ప్రజా చైతన్య యాత్ర పేరుతో పాదయాత్ర చేసేందుకు ప్లాన్ చేశారు. మూసీ పరివాహక గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 8న సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు. అదే రోజున మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేయబోతున్నారు.
ఈనెల 8న మూసీ పునరుజ్జీవ పాదయాత్ర..
