ఇది వివక్ష కాదు కక్ష పూరితంగా వ్యవహరించారు..

ravanth-24.jpg

కేంద్ర బడ్జెట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇది వివక్ష కాదు కక్ష పూరితంగా వ్యవహరించారు. మా మంత్రులు 18 సార్లు ఢిల్లీకి వెళ్లి, ప్రధాని, హోంమంత్రి ఇతర మంత్రుల్ని కలిసి రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హక్కులు, పదేళ్లలో గత ప్రభుత్వం వల్ల జరిగిన నష్టాన్ని సవరించి, అవసరమైన నిధులు ఇవ్వాలని కోరాం. నేను స్వయంగా ప్రధానిని మూడుసార్లు కలిశాను. ప్రధానిని పెద్దన్నగా భావిస్తున్నామని ఆదిలాబాద్ సభలో చెప్పాను. మూడోసారి ప్రధాని అయ్యాక, తెలంగాణకు అవసరమైన నిధులను బడ్జెట్‌లో పొందుపర్చాలని కోరాను అని అన్నారు.

వికసిత్ భారత్‌లో తెలంగాణ భాగం కాదని కేంద్రం అనుకుంటున్నట్లుంది. ఇది కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉంది. బీహార్, ఏపీకి తప్ప ఇతర రాష్ట్రాలకు ఏమీ ఇవ్వలేదు. తన కుర్చీని కాపాడుకునేందుకే ఈ బడ్జెట్ అన్నట్లుంది. ఇంతటి వివక్ష, ఇంతటి కక్ష ఎప్పుడూ లేదు. తెలంగాణ రాష్ట్రం, ప్రజలు, 8 ఎంపీ సీట్లు, 35 శాతం ఓట్లను బీజేపీకి ఇచ్చారు. తెలంగాణ ప్రజల నిర్ణయం వల్ల ప్రధాని మోదీ ఆ సీటులో కూర్చున్నారు. కృతజ్ఞత చూపించాల్సిన మోదీ… కక్షపూరితంగా వ్యవహరించారు. తెలంగాణ ఆత్మగౌరవం పట్ల కేంద్రానికి పట్టింపు లేనట్లుగా కేంద్ర వ్యవహరించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పి, మంత్రివర్గం నుంచి తప్పుకోవాలి.” అని అన్నారు.

Share this post

scroll to top