తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేసింది. గురువారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యచరణపై ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై కీలకంగా చర్చించారు. ఈ రెండు చారిత్రాత్మక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. అంతేకాదు రెండు భారీ బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించారు. ఈ సభలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ లను ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎల్పీ అనంతరం ఢిల్లీకి వెళ్లనున్నారు.