విశాఖ రుషికొండలో నిర్మించిన భవనాలను ఏం చేయాలనే దానిపై సీఎం చంద్రబాబు త్వరలో నిర్ణయం తీసుకుంటారనిఏపీ మంత్రి నారాయణ చెప్పారు. విశాఖపట్నంలోని కాపులుప్పాడ డంపింగ్ యార్డును ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. ఇతర దేశాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్వహణలో దుర్వాసన ఉండదని, అదే విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు. వచ్చే నెల నాటికి టీడీఆర్ కుంభకోణంపై స్పష్టత వస్తుందని, ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. రుషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు దఅష్టి సారించారని తెలిపారు.
రుషికొండ భవనాలపై సీఎం నిర్ణయం..
