కమీషన్ ఇవ్వకపోతే పింఛన్ తీసేస్తాం..

pinshion-31.jpg

అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త పింఛను ఇవ్వకపోగా ఉన్న పింఛనకు కూటమి సర్కారు మంగళం పాడుతోంది. అనర్హుల ఏరివేత పేరిట టీడీపీకి ఒటువేయని వారందరినీ నాయకులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఏకంగా గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన సామాజిక పెన్షన్లకూ నోటీసులు జారీ చేసి అర్హత నిరూపించుకోవాలని, లేకపోతే అనర్హులుగా ప్రకటిస్తామని రీవెరిఫికేషన్ పేరిట ఎంపీడీఓలతో నోటీసులిప్పిస్తున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో అర్హతున్న వారందరికీ వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. కూటమి మేనిఫెస్టోలోనూ పొందుపరిచారు. అయితే కూటమి అధికారం చేపట్టి ఆరునెలలైనా ఇప్పటివరకు ఒక్క పింఛన్ ను కూడా చంద్రబాబు సర్కారు మంజూరు చేయలేదు. పైగా అనర్హత పేరుతో ఉన్న పింఛన్లకు కోత విధిస్తోంది. ఫలితంగా పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశ పడి భంగపడ్డామని విలపిస్తున్నారు.

Share this post

scroll to top