ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నాకు దిగారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు ఐదు నెలల్లోనే రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని, విద్యుత్ చార్జీల పెంపుతో రాష్ట్ర ప్రజలకు హైఓల్టేజ్ షాక్ ఇచ్చారని ఏపిసిసి ఛీఫ్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలపై రూ.6 వేల కోట్ల భారం వేయడానికి సిద్ధమయ్యారని, ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పి ఇప్పుడు ప్రజలపై భారం వేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని వైసీపీ టీడీపీ దొందూ దొందే అంటూ ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు.
విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా..
