కాంగ్రెస్ అంటేనే కరోనా వైరస్ కంటే ప్రమాదం..

ktr-19.jpg

కాంగ్రెస్ అంటేనే కరోనా వైరస్ కంటే ప్రమాదకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెన్షేషనల్ కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ ప్రసంగం చూస్తే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అనే మాట పాతర వేశారని స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. రాహుల్ గాంధీ ప్రకటించిన 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి గురించి ఒక్క మాట కూడా లేదన్నారు. 

అలాగే మహిళలకు తులం బంగారం, నెలకు రూ.2500 గురించి అసలు ప్రస్తావనే లేదు. రేవంత్ రెడ్డి చేతగాని తనానికి నిలువుటద్దం అని బడ్జెట్ చెబుతుందన్నారు. ఏడాది కాలంలో లక్షా 60వేల కోట్లు అప్పులు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాదికి రూ.40వేల కోట్ల అప్పులు చేస్తేనే అప్పులు చేశారని చెబుతున్నారు. ఇవి అప్పులు కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ మహానగరం అద్వానంగా మారిందన్నారు. భట్టి విక్రమార్క ఉపన్యాసం తరువాత ఆరు గ్యారెంటీలు గోవిందా అని స్పష్టంగా అర్థం అయిందని చెప్పారు కేటీఆర్.

Share this post

scroll to top