మా నాయకుడు ను విమర్శిస్తే నాలుక కోస్తాం..

jagareddy-14.jpg

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమ నాయకుడు, సీఎం రేవంత్ రెడ్డి జోలికొస్తే నాలుక కోస్తామని హెచ్చరించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన గాంధీ, కౌశిక్ వివాదం బీఆర్ఎస్ పంచాయితీ అని, కాంగ్రెస్ కార్యకర్తలను ఎందుకు రెచ్చగొడుతున్నారని ప్రశ్నించారు. ఏదైనా పబ్లిక్ ఇష్యూ ఉంటే మాట్లాడాలి కానీ, బీఆర్ఎస్‌ గొడవలోకి ప్రభుత్వాన్ని ఎందుకు లాగుతున్నారని నిలదీశారు. కాంగ్రెస్ జోలికొస్తే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. పొలిటికల్ పవర్ పోవడంతో కేటీఆర్‌కి, బీఆర్ఎస్ నేతలకి ఏమీ అర్థం కావడం లేదని, అందుకే కేసీఆర్ ఫ్యామిలీ రోడ్ల పడి దూకుతున్నారని అన్నారు.

Share this post

scroll to top