పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల కొండపైన దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. తిరుమలలోని నందకం అతిథి గృహంలోని 203 రూమ్‌లో తిరుపతి అబ్బన్న కాలనీకి చెందిన భర్త శ్రీనివాసులు నాయుడు, భార్య అరుణలు చీరతో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం రూమ్ తీసుకున్న వీరు ఉదయం నుంచి రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో టీటీడీ సిబ్బంది అనుమానంతో కిటికీలు తెరిచి చూడగా వారు ఫ్యాన్ కు వేలాడుతున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
తిరుమలలో దంపతుల ఆత్మహత్య..
