భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తుదిశ్వాస విడిచారు. చాలా రోజులుగా వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ డిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి ఇవాళ పూర్తిగా విషమించింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆయనను కాపాడలేకపోయారు. సీతారాం ఏచూరి మృతితో కమ్యూనిస్ట్ పార్టీలో విషాదం నెలకొంది. సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ నాయకుడి మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇతర రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు.
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత..
