ఏపీ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు చకచకా గాడిలో పడుతున్నాయి. రాజధాని అమరావతిలో కీలక పనులను పున:ప్రారంభించేందుకు సీఆర్డీఏ అథారిటీ సమావేశం ఆమోదం తెలిపింది. మొత్తం రూ. 11,467 కోట్ల మేర రాజధానిలో నిర్మాణ పనులు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఆర్డీఏ 41వ అథారిటీ సమావేశంలో ఆ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం తెలిపింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి విషయంలో పలు కమిటీలు వేసి నివేదికల ఆధారంగా ముందుకు వెళ్తున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో రూ. 11,467 కోట్ల విలువైన పనులకు కొత్తగా టెండర్లు పిలిచేందుకు నిర్ణయించారు. ప్రధాని రోడ్లు, ప్రభుత్వ భవనాలు, రిజర్వాయర్ల నిర్మాణం కోసం ఇందులో ఎక్కువగా వెచ్చించనున్నారు.