రాజకీయాల్లో విమర్శలు సహజం దానికి కేసులు పెట్టడం సమంజసం కాదు..

rama-krishna-12-.jpg

రాష్ట్రంలో నిన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్డెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సీపీఐ నేత రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ అతి పెద్ద భారీ బడ్జెట్‌ ను నిన్న ప్రవేశపెట్టారని తెలిపారు. ఇంత లోటు బడ్జెట్ ఉన్నప్పుడు ఏ విధంగా ఇన్ని లక్ష్యాలు సాధిస్తారు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండాలని ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు కరెంట్ చార్జీలు పెంచమని గతంలో చెప్పారని కానీ ఇప్పుడు డిస్కంలు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

ఇదంతా గత ప్రభుత్వ శాపం అంటూ మీరు చెప్పారు. కానీ ఎవరు పాపం చేశారో కానీ ఆ శాపం మాత్రం ప్రజలకు తగులుతుందని అన్నారు. కరెంట్ చార్జీలు తగ్గే వరకు మా పోరాటం కొనసాగిస్తాం అన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలం ఇవ్వాలని ఆయన కోరారు. సోషల్ మీడియాలో బూతు పోస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ తలుచుకుంటే ఈ బూతులను కంట్రోల్ చేయవచ్చు అన్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజం దానికి కేసులు పెట్టడం సమంజసం కాదని సీపీఐ రామకృష్ణ తెలిపారు.

Share this post

scroll to top