విజయవాడలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ న్యాయమహా శిల్పం దాడి చేయడం రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణించి ప్రజాస్వామ్యం గాడి తప్పింది అనడానికి నిదర్శనం అని రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ రాజేష్ తలే అన్నారు. శుక్రవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో ప్రజలు మనల్ని పొందడానికి అభివృద్ధి చేసి,సంక్షేమ కార్యక్రమాలు అందించి మెప్పు పొందాలి కానీ, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల శిలాఫలకాలపై దాడి చేసి కాదన్నారు.రాష్ట్రంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు,హెల్త్ సెంటర్లు,రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు ఇలా ప్రతి గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు గత ప్రభుత్వ హయాంలో జరిగాయని వాటిపై వేసిన శిలాఫలకాలు ధ్వంసం చేయడం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసిన నాయకులు కార్యకర్తలు పై దాడులు చేయడం దారుణమన్నారు.గతంలో ఎప్పుడూ ఈ సంస్కృతి లేదని, ఈ విషసంసృతిని ప్రజాస్వామ్య వాదులు అంతా ఖండించాలని రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ రాజేష్ తలే కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం రాష్ట్రంలో పూర్తిస్థాయిలో శాంతిభద్రతలు నెలకొల్పి దాడులు జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
అంబేద్కర్ విగ్రహంపై దాడి రాష్ట్రంలో పరిస్థితులకు నిదర్శనం..
