విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనానికి చేరుకున్న వైయస్‌ఆర్‌సీపీ నేతల అంబేద్కర్ విగ్రహం నామఫలకంలోని అక్షరాలను రాత్రి లైట్లు ఆర్పేసి ధ్వంసం చేసిన టీడీపీ గూండాలు విగ్రహం వద్దకు చేరుకున్న మాజీ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్ , మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైయస్‌ఆర్‌సీపీ నేతలు దేవినేని అవినాష్, పోతిన మహేష్, దళిత సంఘం నేతలు ఈ సందర్భంగా మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్రంలో రక్షణ లేదు అని ఆరోపించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇక్కడ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పాలకులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని భక్షించాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టు రాత్రి ఘటన స్పష్టంగా కనిపిస్తుంది.. ఇప్పటికే గ్రామ గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన చేయాలని వైసీపీ తరపున పిలుపు ఇచ్చామన్నారు. ఈ విషయంపై లిఖిత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశామని మాజీ మంత్రి మేరుగ నాగార్జున వెల్లడించారు.
బెజవాడ అంబేద్కర్ విగ్రహం దగ్గర వైసీపీ నేతల నిరసన..
