కిసిక్ అంటూ టీటౌన్‌లో కాదు బాలీవుడ్‌లోనూ క్రేజ్ తెచ్చుకుంది డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల. ఒక్క పాటతో నార్త్ ఆడియన్స్‌ను ఫిదా చేసింది. అంతకు ముందు సుమారు డజన్ సినిమాలు చేసినా రాని ఐడెంటిటీ పుష్ప2 స్పెషల్ సాంగ్‌తో తెచ్చుకుంది. ఈ మధ్య కాలంలో సౌత్‌లో కాస్త క్లిక్ అయితే చాలు ఇక్కడి ముద్దుగుమ్మలకు నార్త్ వెంటనే రెడ్ కార్పెట్ వేస్తోంది. అలా శ్రీలీలకు ఛాన్స్ ఇచ్చింది. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తోంది అమ్మడు. దీనికి ఆషికి 3 అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
అనురాగ్ బసు దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాని దీపావళికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా రిజల్ట్ తేలకుండానే మరో ఛాన్స్ కొట్టేసిందట శ్రీలీల. యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా సరసన జోడీ కడుతోంది. దర్శకుడు రాజ్ సాండియాలా నెక్ట్స్ ఫిల్మ్‌లో కమిటైనట్లు తెలుస్తోంది. ఆనంద్ ఎల్ రాయ్ సినిమాను నిర్మిస్తున్నట్లు టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతుందని సమాచారం. బాలీవుడ్‌లో ఈ క్రేజీ ఆఫర్లు చూస్తుంటే మేడమ్ ఫేట్ ను వాళ్ళు ఏ మాత్రం పట్టించుకోనట్లే కనిపిస్తోంది. తెలుగులో ఇప్పటి వరకు తొమ్మిది సినిమాలు చేస్తే నాలుగు మాత్రమే సూపర్ హిట్స్. అందులో ఒకటి స్పెషల్ సాంగ్. మిగిలినవన్నీ ప్లాప్సే. అయినప్పటికీ ఇప్పటికీ ఆఫర్లు కొల్లగొడుతూనే ఉంది. మాస్ జాతర, లెనిన్ లైన్ లో ఉన్నాయి. చరణ్ పెద్దిలో స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు టాక్. ఇవేకాదు తమిళంలో పరాశక్తితో ఎంట్రీ ఇవ్వబోతుంది. శ్రీ లీల కెరీర్ లో భయకంరమైన ప్లాప్స్ ఉన్నా బాలీవుడ్ పిలిచి మరి ఆఫర్స్ ఇస్తోంది. ఇక ఫస్ట్ ప్రాజెక్ట్ రిలీజయ్యే సరికి ఇంకా ఎన్ని ఆఫర్లను అందిస్తుందో ఈ బాలీవుడ్.