కూటమికి బీటలు మొదలైనట్లేనా..

ys-jagn-20.jpg

లోకేష్ కు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కట్టబెట్టాలన్నా పవన్ కళ్యాణ్ అభిప్రాయం తీసుకోవడం చంద్రబాబుకు తప్పనిసరి. అయితే ఇప్పటికే పవన్ కు ప్రోటోకాల్ విషయంలో అన్ని విధాలుగా గౌరవిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు తనకు పోటీగా లోకేష్ కు కూడా డిప్యూటీ సీఎం ఇస్తామని ప్రతిపాదిస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారన్నది చూడాల్సి ఉంది. ముఖ్యంగా ఏ క్యాడర్, లీడర్ల పేరు చెప్పి లోకేష్ ను డిప్యూటీ చేస్తామని టీడీపీ ప్రతిపాదిస్తుందో అదే లీడర్ల పేరు చెప్పి పవన్ వ్యతిరేకించే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే కూటమికి బీటలు మొదలైనట్లే అని వైసీపీ అంచనా వేసుకుంటోంది.

పవన్ కళ్యాణ్ కు పోటీగా లోకేష్ ను చంద్రబాబు డిప్యూటీ సీఎం చేస్తారా లేదా అన్న చర్చను పక్కనబెడితే అసలు ఈ చర్చ తెరపైకి రావడం వైసీపీకి ప్లస్ అన్న వాదన మొదలైంది. కూటమి అధికారంలోకి వచ్చి ఆరునెలలవుతున్నా ఎలాంటి విభేదాలు లేకుండా పక్కా సమన్వయంతో మందుకు సాగిపోతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కారణంగా కూటమికి బీటలు వస్తాయని అంచనాలు వేసిన వైసీపీకి ఇప్పుడు ఆ అవసరం లేకుండా టీడీపీయే ఆ పని చేస్తోందన్న భావన మొదలైంది.

Share this post

scroll to top