ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత.. తీహార్ జైల్లో ఉన్నారు. అయితే బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ కేసుల్లో అరెస్టు కాగా, అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కవిత బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై సోమవారం విచారించిన ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఎక్సైజ్ పాలసీ కేసులో కీలక పాత్ర పోషించినందుకు కవితను మొదట ఈడీ అరెస్టు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు లిక్కర్ పాలసీ కేసును విచారించిన సీబీఐ.. జైల్లో ఉండగానే ఆమెను అరెస్ట్ చేసింది. హైకోర్టులో విచారణ సందర్భంగా, ‘స్కాం’ వెనుక కుట్రలో ఆమె కీలక పాత్ర పోషించారని పేర్కొంటూ బెయిల్ పిటిషన్‌ను సీబీఐ, ఈడీ వ్యతిరేకిస్తూ వస్తున్నాయి.
ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు..
