ఉద్యోగ నోటిఫికేషన్లపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..

batti-07.jpg

ఎన్నికల ముందు ప్రకటించినట్టుగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. గురువారం హైదరాబాదులోని అశోక్ నగర్‌ లో సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ రాష్ట్రం కోరి కొట్లాడి తెచ్చుకున్నదే ఉద్యోగాల సాధన కోసం అని అన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని తరహాలో ఉద్యోగాల భర్తీకి ప్రతి ఏటా వార్షిక క్యాలెండర్ విడుదల చేస్తున్నామని చెప్పారు. ఏ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తామో ముందే తెలియజేస్తున్నామని ఆ పనిలో భాగంగా ఇప్పటికే గ్రూప్ -1 పరీక్షలు విజయవంతంగా నిర్వహించామని, గ్రూప్ -2 పరీక్షలు నిర్వహించబోతున్నామని వెల్లడించారు.

Share this post

scroll to top