ఈ రోజు పల్నాడు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి జిల్లాకు రానుండటంతో అధికారులు, నేతలు ఏర్పాట్లు చేశారు. నేడు మధ్యాహ్నం 12 గంటలకు మాచవరం మండలంలోని సరస్వతి పవర్ భూములను పవన్ కల్యాణ్ పరిశీలిస్తారు. ఇప్పటికే సరస్వతి భూములను సర్వే చేయాలని అధికారులను పవన్ ఆదేశించిన విషయం విదితమే కాగా వారం రోజుల క్రితమే అధికారులు సర్వే పూర్తి చేశారు. దీంతో నేడు స్వయంగా భూములను పరిశీంచనున్నారు పవన్ కల్యాణ్. అయితే, వైఎస్ హయాంలో కేటాయించిన 15 వందల ఎకరాల భూముల్లో అటవీ భూములున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
నేడు పల్నాడు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన..
