డిప్యూటీ సీఎం పవన్ ప్రధాని మోడీతో భేటి అనంతరం కీలక వ్యాఖ్యలు..

pavan-27.jpg

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గత రెండు రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం పలువురు కేంద్ర మంత్రులను కలిసిన ఆయన ఈ రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కార్యక్రమాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రధాని మోడీతో భేటీ అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ తన విలువైన సమయాన్ని ఏపీ ప్రజల కోసం కేటాయించారని ఈ సందర్భంగా ప్రధాని మోడీని ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోడీతో మిటింగ్ పై సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ ఇలా రాసుకొచ్చారు.

Share this post

scroll to top