దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఫిక్స్..

devara-14-.jpg

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 22న జరగనుందని తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో ఈ సినిమా ఈవెంట్ జరిగే ఛాన్స్ ఉందని భోగట్టా. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతులు లభిస్తే కర్నూలులోనే దేవర ఈవెంట్ జరుగుతుందని చెప్పవచ్చు. అనుమతులు రాకపోతే మాత్రం హైదరాబాద్ లో ఈవెంట్ జరిగే ఛాన్స్ ఉంటుంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు సీడెడ్ లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది. తారక్ సినిమాలు సీడెడ్ లో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రికార్డ్ స్థాయిలో అభిమానులు హాజరు కావచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. దేవర ఈవెంట్ లో ఈ సినిమాకు సంబంధించిన మరో ట్రైలర్ విడుదలవుతుందేమో చూడాలి.

Share this post

scroll to top