గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం విడుదలకు ముందే చరణ్ తన కొత్త సినిమాను మొదలు పెట్టారు. బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్నారు. ఆర్‌సీ 16 అనే వర్కింగ్ టైటిట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్ర దర్శకుడు సాలీడ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నారు. ఇందుకోసం ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ ని పిలిపించారు. ఆయన రామ్ చరణ్ కు సరికొత్త హెయిర్ స్టైల్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చరణ్, అకీమ్ హకీమ్‌తో దిగిన ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చరణ్ లుక్ అదిరిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఆర్‌సీ 16 కోసం సరికొత్త లుక్‌లో రామ్‌చరణ్..
