చెర్రీ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. గేమ్ చేంజర్ అప్ డేట్ వచ్చేసింది..

Game-changer.jpg

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా, స్టార్‌ డైరక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గేమ్‌ చేంజర్‌. ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో ప్రెస్టీజియస్‌గా రూపొందుతోంది. ఈ సినిమా రిలీజ్‌ ఎప్పుడు ఉంటుందని ఫ్యాన్స్ చాన్నాళ్లుగా ఆరా తీస్తూనే ఉన్నారు. గేమ్‌ చేంజర్‌ రిలీజ్‌ ఎప్పుడన్నది… శంకర్‌ చెప్పే దాన్ని బట్టి ప్లాన్‌ చేస్తామని ఆ మధ్య దిల్‌రాజు అన్నారు. అక్టోబర్‌లో రిలీజ్‌ చేసుకోవచ్చంటూ శంకర్‌ నుంచి సంకేతాలు అందాయన్నది లేటెస్ట్ గా వినిపిస్తున్న మాట. దీంతో, 2024లో తమ స్టార్‌ మూవీ వచ్చేస్తుందని ఖుషీ అవుతున్నారు మెగా ఫ్యాన్స్.

ఎన్టీఆర్‌ నటిస్తున్న దేవర సినిమాను అక్టోబర్‌ 10న విడుదల చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు మేకర్స్. అయితే ఈ సినిమా ప్రీ పోన్‌ అవుతుందనే వార్తలూ ఉన్నాయి. సెప్టెంబర్‌లోనే తారక్‌ సినిమా ప్రేక్షకులను పలకరించే అవకాశం ఉందన్నది ఫిల్మీ సర్కిల్స్ లో వినిపిస్తున్న న్యూస్‌. అందుకే అక్టోబర్‌లో గేమ్‌చేంజర్‌ని ప్లాన్‌ చేస్తున్నారన్నది టాక్‌.

Share this post

scroll to top