నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మారుతున్న జీవనం విధానం కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అయితే చాలా మంది ఉదయం నిద్ర లేవగానే తల నొప్పితో బాధపడుతూ ఉంటారు. మరికొందరికి అయితే రోజంతా తల నొప్పితో బాధపడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఈ సమస్య కాస్త అధికంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే ఇలా ఉదయాన్నే తలనొప్పి రావడానికి చాలానే కారణాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి, డీహైడ్రేషన్, ఒత్తిడి, శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం, రక్తం తక్కువగా ఉండడం, శరీరంలో నీటి శాతం తక్కువగా ఉండడం.. ఇలా చాలా కరణలనే చెప్పుకోవచ్చు. కొన్ని సూచనలు పాటిస్తూ ఈ సమస్యను చాలా ఈజీగా అధిగమించవచ్చు.
*తల నొప్పిని తగ్గించడానికి ఒక గ్లాస్ నీటిలో నిమ్మరసం కలిపి ప్రతిరోజూ తాగడం వల్ల తలనొప్పి సమస్య దూరం అవుతుంది.
*రోజుకు 8 గంటలు కచ్చితంగా నిద్రపోవడంతో పాటు ప్రతిరోజూ వ్యాయామం, యోగా, ద్యానం వంటివి చేయడం వల్ల ఈ తలనొప్పి సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
*ప్రతిరోజూ పడుకునే ముందు మొబైల్ కు దూరంగా ఉండాలి. ఎలాంటి ఒత్తిడిని దారి చేరనివ్వకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ హాయిగా నిద్రపోవాలి.
*తలనొప్పిగా ఉన్న సమయంలో ధ్యానం చేయడం, శ్వాస వ్యాయామాలు చేయడం వంటి వాటి వల్ల నొప్పి నుండి త్వరితగతిన బయటపడవచ్చు.