ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం నీరు తాగితే ప్రయోజనాలు..

helth-14-.jpg

ఉదయం పూట గోరువెచ్చని బెల్లం నీరు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎసిడిటీ, గ్యాస్ సమస్యలతో ఇబ్బందిపడేవారికి ఇది మంచి ఉపశమనం కలిగిస్తుంది. బెల్లం నీరు జీర్ణక్రియను మెరుగుపరిచే ప్రాకృతి టానిక్. మలబద్ధక సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. బెల్లంలో ఉండే నేచురల్ షుగర్ శరీరానికి తక్కువ క్యాలరీలతో ఎనర్జీ అందిస్తుంది. మెటబాలిజం వేగంగా పనిచేసి కొవ్వును కరిగిస్తుంది. బెల్లంలోని పొటాషియం టాక్సిన్స్, అదనపు ఫ్లూయిడ్స్ ను బయటకు పంపి, శరీరాన్ని శుభ్రపరుస్తుంది. బెల్లంలోని ఐరన్ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. అలసటను తగ్గిస్తుంది. ఉదయాన్నే బెల్లం నీరు తాగితే శరీర శక్తి పెరుగుతుంది.

​రక్తపోటు​లో బీపీ లేదా హై బీపీ తో బాధపడేవారు రోజూ ఉదయాన్నే బెల్లం నీరు తాగడం మంచిది. ఇది రక్తనాళాల్లోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి రక్తపోటును నియంత్రణంలో ఉంచుతుంది. బెల్లంలోని వెచ్చని లక్షణాలు గొంతుకు ఉపశమనం కల్పిస్తాయి. దగ్గు, కంజెషన్,ఉబ్బసం, బ్రోన్కైటిస్‌ నుంచి ఉపశమనం కలుగుతుంది. బెల్లం నీరు జీవక్రియను క్రమబద్ధీకరిస్తుంది. ఆకలిని తగ్గించి బరువు నిర్వహణలో తోడ్పడుతుంది. లివర్ నుండి హానికరమైన టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. రక్తపోటు​లో బీపీ లేదా హై బీపీ తో బాధపడేవారు రోజూ ఉదయాన్నే బెల్లం నీరు తాగడం మంచిది. ఇది రక్తనాళాల్లోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి రక్తపోటును నియంత్రణంలో ఉంచుతుంది.

బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.పింపుల్స్, మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. బెల్లంలోని ఐరన్ కంటెంట్ రుతు తిమ్మిరి, ఉబ్బరం, మూడ్ స్వింగ్‌లను తగ్గిస్తుంది. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. ఒక చిన్న ముక్క బెల్లాన్ని వేసి పూర్తిగా కరిగే వరకు కలపాలి. దీన్ని రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మెరుగైన ఫలితాలు పొందవచ్చు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితాలు ఇస్తుంది. భోజనం తర్వాత తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

Share this post

scroll to top